ఆంతరంగిక విధానము :-

www.globalglaze.com (“వెబ్సైట్”) ద్వారా కాని లేదా మరే ఇతర మాధ్యమము ద్వారా కాని గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై.లి. (“గ్లేజ్”) కు మీరు అందించే మీ సమాచారానికి కంపెనీ ఏర్పాటు చేసిన పరామితులకు సంబంధించి మీకు అవగాహన కలిగించడమే ఈ ఆంతరంగిక విధానము యొక్క ఉద్దేశము. మీరు మా వెబ్సైట్ ను ఉపయోగించినపుడు మా వెబ్సైట్ లో మీరు ఎంటర్ చేసే ఆంతరంగిక సమాచారాన్ని పరిరక్షించుటకు మరియు సురక్షితము చేస్తామని మేము మా ప్రతిజ్ఞను అందిస్తున్నాము. మీరు మా ఉత్పత్తులను మరియు సేవలను ఉపయోగించేటప్పుడు మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము, ఎందుకు సేకరిస్తాము మరియు మిమ్మల్ని సంప్రదించుటకు దానిని ఎలా ఉపయోగిస్తాము అనేది ఈ వాక్యము వివరిస్తుంది.
సమయానుసారంగా ఈ విధానాన్ని సవరించుటకు గ్లేజ్ హక్కు కలిసి ఉంది.
ఈ ఆంతరంగిక వాక్యము (“స్టేట్మెంట్”) లో, పదాలు:-
“మేము”, “మా” మరియు “మాకు” అనె పదాలు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై. లి. (“గ్లేజ్”) మరియు గ్లేజ్ యాజమాన్యము వహించే ఇతర సంస్థలను ప్రస్తావిస్తాయి.
“మీరు” మరియు “మీ యొక్క” అనే పదాలు గ్లేజ్ డిస్ట్రిబ్యూటర్లు, వినియోగదారులు, సందర్శకులు, యూజర్లు మరియు ఈ వెబ్సైట్ ఉపయోగించే ఇతరులను ప్రస్తావిస్తాయి.

సమాచార సేకరణ

మీరు సంపూర్ణమైన, వాస్తవమైన, ఖచ్ఛితమైన మరియు ప్రస్తుత సమాచారాన్ని అందిస్తారు. మీరు మాకు అందించే సమాచారము అంతా సురక్షితంగా మరియు ఛేదించరాని నిలువలో ఉంచబడుతుంది. మీ అప్‍లైన్, మీ అతిథి మరియు మీ వస్తువులు మొదలైన విషయాల గురించిన సమాచారము కూడా మేము సేకరించవచ్చు.
గ్లేజ్ వెబ్సైట్ ద్వారా ఈ క్రింది విధంగా వివిధ అంశాల గురించి సమాచారాన్ని సేకరించవచ్చు:
రిజిస్ట్రేషన్; బ్యాంక్ వివరాల నిలువ; సర్వేలు మరియు ప్రమోషన్లు

రిజిస్ట్రేషన్

గ్లేజ్ అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయ్యెందుకు మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఉదా-పేరు, వయసు, పుట్టినతేదీ, చిరునామా, సంప్రదింపు వివరాలు, ఈ-మెయిల్ చిరునామా, లింగము మరియు వృత్తి.

బ్యాంక్ వివరాల నిలువ

మీరు మరియు గ్లేజ్ మధ్య చెల్లింపులను ప్రక్రియ చేయుటకై, మేము మీకు అకౌంట్ పేయీ చెక్ లేదా ఎన్‍ఈఎఫ్‍ఈ బ్యాంక్ బదిలీ ద్వారా చెల్లింపు చేస్తాము కాబట్టి మీరు మీ బ్యాంక్ వివరాలను అందించవలసి ఉంటుంది. ఇలాంటి సమాచారాన్ని పదిలపరచడము మా బాధ్యత మరియు ఇలాంటి సమాచారము మీరు కోరుకుంటే తప్ప వెబ్సైట్ పై కనిపించదని మేము హామీ ఇస్తున్నాము.

స్పందన మరియు ఫిర్యాదులు

గ్లేజ్ ఉత్పత్తులు మరియు సేవల గురించి మీ స్పందనను లేదా ఏదైనా ఫిర్యాదును ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏ సమయములో అయినా మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని తెలుపుతూ మాకు అందించవచ్చు, తద్వారా మేము మీ మరింత మెరుగైన ఉత్పత్తులు మరియు సేవలతో మీకు సేవలను అందించగలము.

మీ సమాచార వినియోగము

1)    మీరు మీ పనిని చేసుకొనుటకు మా వెబ్సైట్ లోకి లాగిన్ కావాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని ప్రమాణీకరించుట కొరకు మేము మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మీరు మీ ఖాతాలోకి లాగిన్ అయ్యేందుకు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

2)    అభ్యర్ధనలకు స్పందించుటకు; సేవలను పర్యవేక్షించుటకు మరియు అందించుటకు; మీ ఐడీ ఖాతాను నిర్వహించుటకు మేము మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

మీ సమాచారాన్ని మూడవ వ్యక్తులతో పంచుకోవడము

1)    నిర్దేశించబడినప్పుడు లేదా చట్టము ప్రకారముగా అవసరము అయినప్పుడు తప్ప మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని మూడవ వ్యక్తులతో పంచుకోవడము, పంపిణీ చేయడము, అమ్మడము, వాణిజ్యము చేయడము, అద్దెకు ఇవ్వడము లేదా మరే విధంగా కాని తెలియజేయమని మేము మీకు హామీ ఇస్తున్నాము.

2)    మీకు సరైన మార్గదర్శకాన్ని అందించుటకు మరియు మీకు ఒక సానుకూల అనుభవాన్ని అందజేయుటకు మీ సమాచారాన్ని మీ అప్‍లైన్ లేదా ఎవరైనా ఉన్నత స్థాయి డిస్ట్రిబ్యూటర్‍తో మేము పంచవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచడము లేదా దుర్వినియోగము చేయకుండా ఉండుటకు మీ అప్‍లైన్ బాధ్యత కలిగి ఉంటారు మరియు మీ సమాచారాన్ని ఉపయోగించేటప్పుడు ఆంతరంగిక విధానము యొక్క నిబంధనలు వర్తించుటకు హామీ ఇస్తారు.

3)    మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీకు అప్‍డేట్స్ అందించుటకు, మీ చెల్లింపులు ప్రక్రియ చేయుటకు మేము మీ సమాచారాన్ని మూడవ వ్యక్తులతో పంచవచ్చు.

4)    మూడవ వ్యక్తులకు మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచేటప్పుడు మీ సమాచారము ఒప్పంద మరియు సాంకేతిక భద్రతల ప్రకారము ఉపయోగించబడుతుందని మేము మీకు హామీ ఇస్తున్నాము.

వ్యాపార బదిలీలు

గ్లేజ్ యొక్క అన్ని లేదా ఒక భాగము యొక్క విలీనం, అమ్మకం, భాగస్వామ్య వెంచర్, అసైన్మెంట్, బదిలీ లేదా ఇతర వినియోగాధికార సంధర్భములో మూడవ వ్యక్తులకు మీ నుండి సేకరించిన మీ సమాచారాన్ని ఒక భాగాన్ని లేదా మొత్తాన్ని బదిలీ చేసే హక్కును మేము కలిగి ఉన్నాము

సమాచారాన్ని మీరు వెనక్కు తీసుకోవచ్చు లేదా అప్డేట్ చేయవచ్చు

ఏ సమయములో అయినా మార్కెటింగ్ ఉద్దేశాల కొరకు మీరు మా వెబ్సైట్ పై సబ్మిట్ చేసిన సమాచారాన్ని అప్‍డేట్ లేదా వెనక్కు తీసుకోవడం చేయవచ్చు, మీ సమాచారాన్ని మా రికార్డులలో అప్‍డేట్ చేసుకునేందుకు దయచేసి మమ్మల్ని సంప్రదించండి లేదా మీరు ఆన్‍లైన్‍లో వెబ్సైట్స్ ను సందర్శించి మీ సమాచారాన్ని మీరే అప్‍డేట్ చేసుకోవచ్చు.

కుకీస్

ఒక వెబ్ సర్వర్ ద్వారా వెబ్ బ్రౌజర్ కు పంపబడిన ఒక సందేశం. బ్రౌజర్ సందేశాన్ని టెక్స్ట్ ఫైల్ గా నిలువ చేసుకుంటుంది. సర్వర్ నుండి బ్రౌజర్ ఒక పేజ్ ను అభర్ధించిన ప్రతిసారి ఆ సందేశము సర్వర్ కు వెనక్కు పంపించబడుతుంది. యూజర్లను గుర్తించుట మరియు వారి కొరకు కస్టమైస్డ్ వెబ్ పేజీలను తయారుచేయడము కుకీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. కుకీస్ ఉపయోగించి మీరు వెబ్సైట్ లోనికి ప్రవేశించినప్పుడు, మీ పేరు మరియు ఆసక్తులు మొదలైన సమాచారాన్ని అందిస్తూ ఒక పత్రాన్ని పూర్తి చేయమని మీరు అడగబడతారు. ఈ సమాచారము ఒక కుకీ లాగా మార్చబడుతుంది మరియు మీ వెబ్ బ్రౌజర్ కు పంపించబడుతుంది, దానిని మీ వెబ్ బ్రౌజర్ తరువాత వినియోగము కొరకు నిలువ చేస్తుంది. తరువాత ఎప్పుడైనా మీరు అదే వెబ్సైట్ కు వెళ్ళినప్పుడు, మీ బ్రౌజర్ ఆ కుకీని వెబ్ సర్వర్ కు పంపిస్తుంది. కస్టమ్ వెబ్ పేజీలను అందించుటకు సర్వర్ ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి, ఉదాహరణకు, ఒక సాధారణ స్వాగత పేజ్ చూసే బదులు మీరు మీ కలిగిన ఒక స్వాగత పేజ్ ను చూడవచ్చు.

కుకీ అనే పేరు మాజిక్ కుకీస్ అని పిలువబడే UNIX వస్తువుల నుండి వచ్చింది. ఇవి ఒక యూజర్ లేదా ప్రోగ్రామ్ కు జతపడిఇ ఉన్న టోకెన్స్ మరియు యూజర్ లేదా ప్రోగ్రామ్ ద్వారా ఎంటర్ చేయబడిన ప్రదెశాల ఆధారంగా మారతాయి. అయినప్పటికీ మీ వెబ్ బ్రౌజర్ (ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్, మొజిల్లా ఫైర్‍ఫాక్స్ వెబ్ బ్రౌజర్, ఒపెరా వెబ్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్) అనుసరించి దానిని కస్టమైజ్ చేయడము ద్వారా మీరు మీ ప్రాధాన్యతల ప్రకారము మీ కుకీ సెట్టింగ్స్ ను మార్చుకోవచ్చు.

ఒక కుకీ ఏ సమాచారాన్ని నిలువచేస్తుంది?

చాలా వరకు ఒక కుకీ బ్రౌజర్ గురించిన సమాచారము ఉన్న ఒక టెక్స్ట్ స్ట్రింగ్ కలిగి ఉంటుంది. పనిచేయుటకు, ఒక కుకీకి మీరు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోనవసరము లేదు; అది మీ బ్రౌజర్ ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వెబ్ సైట్లు మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని నిలువ చేయుటకు ఉపయోగిస్తాయి. అయినప్పటికీ, మీకు మీరే వెబ్సైట్ కు ఆ వ్యక్తిగత సమాచారాన్ని అందించినప్పుడే జరుగుతుంది. మీ కుకీ ఫోల్డర్ కు యాక్సెస్ కలిగిన వేరొక పార్టీ అనధికారికంగా ఉపయోగించుటకు నివారించుటకు చట్టబద్దమైన వెబ్సైట్లు కుకీలో నిలువచేయబడిన ఈ వ్యక్తిగత సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాయి.

కుకీస్ కు వాటికి పాస్ చేయదగిన ఆరు పారామీటర్స్ ఉంటాయి :

  • కుకీ పేరు.
  • కుకీ విలువ.
  • కుకీ యొక్క కాలపరిమితి ముగింపు తేదీ – కుకీ మీ బ్రౌజర్ లో ఎంత కాలం క్రియాశీలకంగా ఉంటుంది అని ఇది నిర్ణయిస్తుంది.
  • కుకీ చెలామణి అయ్యే పాథ్ – ఇది కుకీ చెలామణి అయ్యే URL పాథ్ ను సెట్ చేస్తుంది. ఈ పాథ్ వెలుపల ఉన్న వెబ్ పేజీలు ఈ కుకీని ఉపయోగించలేవు.
  • కుకీ చెలామణి అయ్యే డొమెయిన్. ఒక డొమెయిన్ లో సైట్ బహుళ సర్వర్లు ఉపయోగించినప్పుడు కుకీ ఏ సర్వర్ పై అయినా పేజెస్ కు యాక్సెసబుల్ అయ్యేలా చేస్తుంది.
  • సురక్షితమైన కనెక్షన్ యొక్క ఆవశ్యకత – కుకీ ఒక సురక్షితమైన సర్వర్ స్థితిలో మాత్రమే ఉపయోగించబడ వచ్చు అని ఇది సూచిస్తుంది, ఉదా SSL ఉపయోగించే ఒక సైట్.

కుకీస్ ను నేను ఎలా ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయగలను ?

ఈ విభాగము కుకీస్ ను ఎలా ఎనేబుల్ చేయాలి (టర్న్ ఆన్ కుకీస్) మరియు వాటిని ఎలా డిసేబుల్ చేయాలి అనేది మీకు తెలియజేస్తుంది. కుకీస్ మీ వెబ్ బ్రౌజర్ ద్వారా నిర్వహించబడతాయి కాబట్టి, వాటిని ఎనేబుల్ చేయడము లేదా డిసేబుల్ చేసే పద్ధతి మీరు ఉపయోగించే బ్రౌజర్ పై ఆధారపడి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ 8.0 లేదా 9.0:- ‘టూల్స్ ఎ ఇంటర్నెట్ ఆప్షన్స్’ మెనూ అంశాన్ని ఎంచుకోండి, తరువాత ‘ప్రైవెసీ’ టాబ్ ఎంచుకోండి – కుకీ యొక్క వివిధ క్యాటగరీలను బ్లాక్ చేయుటకు లేదా అనుమతించుటకు మీరు స్లైడర్ ను సవరించవచ్చు. ప్రత్యామ్నాయంగా ‘అడ్వాన్స్డ్’ క్లిక్ చేయడము ద్వారా మీరు బ్రౌజర్ యొక్క ప్రవర్తననపై మీరు మరింత నియంత్రణను పొందవచ్చు, మీరు సందర్శిస్తున్న వెబ్సైట్ పై (ఫస్ట్ పార్టీ కుకీస్) ఉత్పన్నము అయ్యే కుకీలను కాని లేదా మీరు సందర్శిస్తున్న వెబ్సైట్స్ కాకుండా ఇతర వెబ్సైట్స్ (మూడవ వ్యక్తి కుకీస్, ఒక ప్రకటనదారుడి వెబ్సైట్ పై హోస్ట్ చేయబడిన బ్యానర్ ప్రకటనల ద్వారా సాంప్రదాయకంగా ఉపయోగించబడేవి) నుండి ఉత్పన్నము అయ్యే కుకీస్ లను కాని, అంగీకరించుటకు, బ్లాక్ చేయుటకు, లేదా ప్రేరేపించుటకు మీరు ఎంచుకోవచ్చు.

ఫైర్‍ఫాక్స్ 7.0:- ‘టూల్స్ ఎ ఆప్షన్స్’ మెనూ అంశాన్ని ఉపయోగించండి (ఫైర్‍ఫాక్స్ బటన్ దిగువన ఉండవచ్చు), తరువాత ‘ప్రైవెసీ’ టాబ్ ఎంచుకోండి. ‘కస్టమ్ సెట్టింగ్స్ ఫర్ హిస్టరీ’ ఉపయోగించుటకు ‘ఫైర్‍ఫాక్స్ విల్:’ ఐచ్ఛికాన్ని సెట్ చేయండి. ఇప్పుడు మీరు సందర్శించే వెబ్సైట్స్ లేదా మూడవ వ్యక్తి వెబ్సైట్స్ కొరకు కుకీస్ ఎనేబుల్ చేయబడ్డాయా అని మీరు ఎంచుకోవచ్చు, ఒకవేళ ఎనేబుల్ చేయబడితే ఎంతకాలం అవి ఉంటాయి. ప్రత్యేకమైన వెబ్సైట్స్ కొరకు సెట్టింగ్స్ ను ఓవర్ రైడ్ చేయుటకు మీరు ‘ఎక్సెప్షన్స్’ బటన్ కూడా ఉపయోగించవచ్చు.

ఫైర్‍ఫాక్స్ 3.0:- ‘టూల్స్ ఎ ఆప్షన్స్’ మెనూ అంశాన్ని ఉపయోగించండి, మరియు ‘ప్రైవెసీ’ ట్యాబ్ ఎంచుకోండి. ఇక్కడ కుకీస్ ఎనేబుల్ చేయబడ్డాయా అని మీరు ఎంచుకోవచ్చు, ఒకవేళ ఎనేబుల్ చేయబడితే ఎంతకాలం అవి ఉంటాయి. ప్రత్యేకమైన వెబ్సైట్స్ కొరకు సెట్టింగ్స్ ను ఓవర్ రైడ్ చేయుటకు మీరు ‘ఎక్సెప్షన్స్’ బటన్ కూడా ఉపయోగించవచ్చు.

గూగుల్ క్రోమ్ 5.0:- ‘కస్టమైజ్ అండ్ కంట్రోల్’ మెనూలో ‘ఆప్షన్స్’ ఎంచుకోండి, తరువాత ‘అండర్ ది బానెట్’ టాబ్ ఓపెన్ చేయండి. ‘ప్రైవెసీ’ విభాగములో, ‘కంటెంట్ సెట్టింగ్స్’ బటన్ పై క్లిక్ చేయండి మరియు ‘కుకీస్’ టాబ్ ఓపెన్ చేయండి. కావలసిన కుకీ ప్రవర్తనను సెట్ చేయండి ప్రత్యేక వెబ్సైట్స్ కాన్ఫిగూర్ చేయుటకు ‘ఎక్సెప్షన్స్…’ బటన్ (అవసరమైతే) ఉపయోగించండి

ఆపిల్ సఫారి 5.0:- ‘సెట్టింగ్స్’ మెనూలో ‘ప్రిఫరెన్సెస్’ ఎంచుకోండి, ఆ తరువాత ‘సెక్యూరిటీ’ టాబ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కావలసిన కుకీ ప్రవర్తనను సెట్ చేయండి.

గమనిక: కుకీస్ ను డిసేబుల్ చేయడము వలన కొన్ని వెబ్సైట్స్ సరిగ్గా పనిచేయడాన్ని నిరోధించవచ్చు మరియు ఒక కుకీలో సాధారణంగా నిలువ చేయబడిన సమాచారాన్ని రీ-ఎంటర్ చేయుటకు మీరు ప్రేరేపించబడ్డారని అర్థం కావచ్చు.

సవరణలు

గ్లేజ్ తన వెబ్సైట్ అయిన www.globalglaze.com పై ఒక వ్రాతపూర్వక ప్రకటన ద్వారా ఈ పాలసీలో వివరించబడిన ఏ విషయాన్నైనా సవరించుటకు, మార్చుటకు లేదా పునరుద్ధరించుటకు హక్కు కలిగి ఉంది. ఒకవేళ మీరు ఈ సవరణలను అంగీకరించకపోతే, ఇలాంటి ప్రకటన వచ్చిన 30 రోజుల లోపల మమ్మల్ని సంప్రదించవచ్చు. గ్లేజ్ తో మీ బాంధవ్యం అన్ని సవరణలకు ఆమోదముగా పరిగణించబడుతుంది.

తనది కాదను వ్యక్తి

వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం మరియు సూచనల విషయంలో ఇంగ్లీష్ మరియు ఇతర లాంగ్వేజి వెర్షన్ల మధ్య ఏదైనా అసమానత, లోపం లేదా వ్యత్యాసం ఉన్నపుడు, ఇంగ్లీష్ వెర్షన్ ని మాత్రమే ఆదర్శంగా పరిగణించాలి.

మమ్మల్ని సంప్రదించండి

మీకు ఉన్న మరిన్ని ప్రశ్నలు లేదా వ్యాఖ్యల కొరకు మీరు మా వెబ్సైట్ లేదా ఈ వెబ్సైట్ ద్వారా మీకు అందించబడిన ఇతర ఈమెయిల్ లింక్స్ ద్వారా లేదా మరే విధంగా అయినా మీరు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. మీకు తక్షణమే సమాధానము ఇచ్చేందుకు ప్రయత్నిస్తాము. మేము ఈ సమాచారాన్ని మీ ప్రశ్నలకు స్పందించుటకు ఉపయోగించవచ్చు మరియు మా వినియోగదారుల సేవలను మెరుగుపరచుకునేందుకు మీ వ్యాఖ్యానాలను రికార్డ్ చేయవచ్చు.