sanjeev sir

శ్రీ సంజీవ్ ఛిబ్బర్ ఫౌండర్ డైరెక్టర్

"పోరాటం ఎంత కష్టతరమైనదో విజయం అంత హుందాతనాన్ని సంతరించుకుంటుంది.”

గొప్ప ఆలోచనలు, గొప్ప స్ఫూర్తి గల శ్రీ సంజీవ్ ఛిబ్బర్, సాహసానికీ, తన విశ్వాసాల పట్ల అచంచలమైన నమ్మకంతో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొని ఓడించే నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఏ రంగమైనా ఏ పనైనా విజయం వైపు నడిపించే నైపుణ్యం శ్రీ ఛిబ్బర్ కి తెలుసు. గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీ సంజీవ్ చిబ్బర్, గొప్ప నైపుణ్యంగల పారిశ్రామికవేత్తలా ప్రతి రంగంలోనూ విజయం సాధించారు. ఒకప్పుడు ఇంటి ఖర్చుల కోసం ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న శ్రీ సంజీవ్ ఛిబ్బర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తన అజేయమైన దీర్ఘకాలిక ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదలుపెట్టినపుడు ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా కూడా ఉన్నప్పటికీ ఆయన ఆ పరిస్థితులలో తగిలిన ఎదురుదెబ్బల్నే తన విజయానికి పునాది రాళ్లుగా చేసుకున్నారు. అందరి హృదయాల్నీ తన వినమ్రతతో గెల్చుకున్న వ్యక్తిత్వం శ్రీ సంజీవ్ చిబ్బర్ ది. ఆయన తన కలలను వాస్తవంగా మార్చుకునే దిశగా అడుగులు కదుపుతూ ముందుకు సాగుతున్నారు.

డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకురావడానికీ, దాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకు వెళ్లడానికీ, శ్రీ సంజీవ్ ఛిబ్బర్ గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ని ప్రతిష్టాత్మక బిజినెస్ ప్లాన్ ని సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విస్తరణ చేయాలనే వ్యూహంలో భాగంగా, ఆయన గ్లోబల్ స్థాయిలో గాల్వే వ్యాపారానికి సమగ్రమైన పటిష్టమైన నెట్‌వర్క్‌ను విస్తరించడానికీ, వివిధ కులాలు, వర్గాలు, మతాలకి చెందిన ప్రజలకు సమర్థవంతమైన వ్యాపార అవకాశాన్ని అందించడానికి ఆయన ప్లాన్ చేశారు.

శ్రీ చేతన్ హాండా ఫౌండర్ డైరెక్టర్

“వైఫల్యం జీవితం ముగింపు కాదు, విజయానికి నాంది”

ఏ మనిషైనా తన ఆకృతి వల్ల పెద్దవాడు కాదు, తన ఆలోచన వల్లే పెద్దవాడవుతాడు. ఒక వ్యక్తి ఆలోచనే స్వప్నంగా మారుతుంది. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి యువ వ్యవస్థాపకుడైన శ్రీ చేతన్ హాండా పూనుకున్నారు. శ్రీ చేతన్ హాండా తన కెరీర్ ని చిన్న స్థాయిలో ప్రారంభించినా, ఆయన స్వప్నాలు మాత్రం చాలా పెద్దవి. అందుకే సహనం, పట్టుదలతో ఆయన భారతదేశంలో తన స్వంత మార్కుతో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష అమ్మకపు కంపెనీ అయిన గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సహ-వ్యవస్థాపకులయ్యారు.

సైన్స్ గ్రాడ్యుయేట్, ఫైనాన్స్ లో ఎంబీఏ శ్రీ చేతన్ హాండా తన వ్యాపార ప్రయాణాన్ని చాలా వినమ్రంగా ప్రారంభించారు. కానీ చాలా త్వరలోనే ఆయనకి ఒక ఆసక్తికరమైన అద్వితీయమైన ఆలోచన తట్టింది. ఫలితంగా, 2003 సంవత్సరంలో గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆవిర్భవించింది. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాలకు గొప్ప అవకాశాలు సృష్టింపబడడంతో శ్రీ చేతన్ హాండా నెమ్మదిగా విజయం దిశగా నెమ్మదిగా సాగే ఒక వ్యాపారానికి రూపకల్పన చేసి దాన్ని బలోపేతం చేయాలనుకున్నారు, అలాగే ఆ లక్ష్యాన్ని సాధించారు కూడా.

గొప్ప నైతిక విలువలు గల చేతన హాండా ఎల్లప్పుడూ పని విషయంలో ఒక పారదర్శకమైన వాతావరణాన్ని సృష్టించారు. అలాగే ఆయన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని బలోపేతం చేయడానికి ఒక కొత్త పటిష్టమైన విధానాన్ని సిద్ధం చేశారు. ఆయన ఎల్లప్పుడూ భారతదేశం వంటి సాంస్కృతిక వైవిధ్యం ఉన్న దేశంలో వ్యాపారాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉంటాయని నమ్మినవ్యక్తి. ఇందులో కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే కాక, కొత్త అనుబంధాలు కూడా ఏర్పడతాయి. ఈ వ్యాపారం ద్వారా, ఉత్పత్తులు, సేవలు, వ్యాపార అవకాశాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడమే ఆయన లక్ష్యం. కంపెనీ అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఆయన భారతదేశంలో ప్రత్యక్ష అమ్మకపు వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సంపన్నమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

శ్రీ సరబ్జిత్ సింగ్ అర్రనేజాడైరెక్టర్

“మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చవచ్చు మీ అలవాట్లు మీ భవిష్యత్తును మార్చగలవు”

నాయకత్వ, వ్యాపార రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న శ్రీ సరబ్జిత్ సింగ్ కామర్స్ లో గ్రాడ్యుయేట్. ఆయన కొత్త, సాంప్రదాయేతర, ప్రగతిశీల ఆలోచనలతో గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డివిజన్ ప్రముఖులుగా బాధ్యత వహిస్తున్నారు. శ్రీ సరబ్జిత్ సింగ్ ఆర్నెజా కంపెనీ డైరెక్టర్ కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించే ఉత్సాహవంతులైన శ్రీ సరబ్‌జిత్ సింగ్ అర్నేజా, చిన్న స్థాయి నుంచి ప్రారంభించి ఘన విజయాన్ని అందుకున్నారు. వీరు ఇచ్చే అద్భుతమైన శిక్షణా మాడ్యూల్, వ్యవస్థాపక విధానం, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సమర్థవంతమైన సేల్స్ ని నమోదు చేసుకుంది. శ్రీ సరబ్జిత్ సింగ్ ఆర్నెజా బహుముఖ ప్రతిభాశాలి. వీరి నాయకత్వంలో, గ్లేజ్ సేల్స్ టీమ్ నిరంతరం బలపడుతూనే ఉంది.

ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారానికి సంబంధించి స్పష్టంగా నైతికపరమైన పటిష్టమైన ఇమేజ్‌ను ఎస్టాబ్లిష్ చేయడమే శ్రీ సరబ్‌జిత్ సింగ్ అర్నాజా సంకల్పం. కంపెనీ రాన్ భవిష్యత్ అభివృద్ధి వ్యూహంలో భాగంగా కంపెనీ సేల్స్ ఫార్స్ లో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన వ్యవహారమంతా పూర్తిగా మార్చివేస్తుంది.

శ్రీ సుమిత్ కోహ్లీ డైరెక్టర్

“ఒక వ్యక్తి గట్టిగా సంకల్పం చేసుకుంటే, అసాధ్యంగా అనిపించే ఏ పనినైనా సుసాధ్యం చేయగలడు”

ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వ్యక్తిత్వంతో మృదు స్వభావి, వినయశీలి శ్రీమతి సుమిత్ కోహ్లీ గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ లో ఆపరేషనల్ డివిజన్ కి హెడ్ గా ఉండడంతో బాటు ఇ-కంపెనీ డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ బాధ్యతని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీమతి సుమిత్ కోహ్లీ తన సంకల్ప శక్తితో లక్ష్యాన్ని సాధించారు. చాలా తక్కువ సమయంలో కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్‌లో బలమైన స్థానం సంపాదించారు. కంపెనీ సేవ మరియు కార్యకలాపాల ఫిర్యాదులకు సంబంధించిన విషయాల్ని వ్యక్తిగత పర్యవేక్షణలో చూసుకునే శ్రీమతి సుమిత్ కోహ్లీ, కంపెనీ మొత్తం నెట్‌వర్క్ సజావుగా నిర్వహించే బాధ్యతని చూస్తున్నారు..

గ్లేజ్‌తో శ్రీ సుమిత్ కోహ్లీ ప్రయాణం 2003 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుండి ఆమె కంపెనీలో అంతర్భాగంగా ఉంటున్నారు. అత్యంత నిశితమైన దృష్టి కలిగిన శ్రీ సుమిత్ కోహ్లీ, ఖాతాదారులకు, అమ్మకపు భాగస్వాములకు అద్భుతమైన సేవలను అందించడం ద్వారా ఇప్పటికే ఉన్న ప్రత్యక్ష అమ్మకపు వ్యాపారంలో గొప్ప మార్పు తీసుకురావడానికి మరింత అంకితభావంతో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

శ్రీ సంజయ్ వర్మడైరెక్టర్

“ఆలోచన నుండి పని ఉత్పన్నమవుతుంది, కర్మ ద్వారా అలవాటు సృష్టించబడుతుంది, మీ చరిత్ర మీ భాగ్యాన్ని సృష్టిస్తుంది”

పంజాబ్‌లోని లూధియానాలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీ సంజయ్ వర్మ చిన్నతనం నుంచీ గొప్ప ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకున్నారు. మృదుస్వభావి. చక్కటి చిరునవ్వుతో వ్యాపార నైపుణ్యంలో ఆరితేరిన శ్రీ సంజయ్ వర్మ ఏ పనైనా తనదైన శైలిలో విలక్షణంగా పరిపూర్ణంగా చేసే వ్యక్తి. అందుకే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత, ఆయన ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లే బదులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించాలని నిర్ణయించుకున్నారు. ఈనాడు డైరెక్టర్‌గా గ్లేజ్‌లో ఆయన అపూర్వమైన సేవలు అందిస్తున్నారు.

సంజయ్ వర్మ మొత్తం దేశం గాల్వే బిజినెస్ ని విస్తరింపజేయడంలో ప్రముఖ్యమైన విజయం సాధించిన అత్యంత సమర్ధవంతులు, చెప్పుకోదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రీ సంజయ్ వర్మ ఈనాడు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ విభాగాన్ని విజయవంతంగా నడిపించడంతో పాటు, గాల్వే బిజినెస్ ని విజయవంతంగా కొత్త స్థాయిలకి తీసుకువెళ్తున్నారు.