bread

గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి. లిమిటెడ్.


గ్లేజ్ గురించి

దేశంలో అత్యుత్తమ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో ఒకటైన గ్లేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ని శ్రీ సంజీవ్ ఛిబ్బర్, శ్రీ చేతన్ హండా అనే ఇద్దరు దూరదృష్టి గల వ్యవస్థాపకులు 2003 సంవత్సరంలో స్థాపించారు. అందరి సహకారంతో అందరూ ఎదగాలి అనే ప్రధాన లక్ష్యంతోనే గ్లేజ్ ఏర్పాటు జరిగింది. జీవితాన్ని సమృద్ధవంతం చేయడం, ఈ వ్యాపారంతో అనుబంధం కలిగి ఉన్న వ్యాపారవేత్తల జీవితాల్ని సుసంపన్నం చేయడం వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం కూడా గ్లేజ్ స్థాపన ప్రధాన లక్ష్యం.

సంగ్రహంగా చెప్పాలంటే, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక సూత్రం ఒకటే, అధిక నాణ్యత గల ఎఫ్ఎంసిజి ఉత్పత్తుల్ని సరసమైన ధరల్లో వినియోగదారులకు చేర్చడం, తద్వారా వచ్చే వ్యాపార లాభాలను పంపిణీ, మార్కెటింగ్ లో పాలుపంచుకుంటున్న ఛానల్ భాగస్వాములతో కలిసి పంచుకోవడం. అంటే, దీని ద్వారా సంపాదించిన డబ్బుని పాల్గొనేవారి మేలు కోసం పంచగలిగే వ్యాపారాన్ని క్రియేట్ చేయడం.

కంపెనీ వ్యవస్థాపకుల స్పష్టమైన దృష్టి, అభిరుచి, సానుకూల వైఖరి, గొప్ప పనులు చేయాలనే కోరిక, ప్రాక్టికాలిటీ వంటి లక్షణాలు, అలాగే వారి నాయకత్వంలో పనిచేసే నిర్వాహక సిబ్బంది ప్రధాన బృందం చేసిన కృషి కూడా ఈ విజయ శిఖరాన్ని చాలా త్వరగా అధిరోహించడానికి కంపెనీకు సహాయపడింది. నేడు దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షలకి పైగా మరింత స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లు, 256 కి పైగా ఫ్రాంచైజీలు ఉన్నారు, వీరంతా గాల్వే బిజినెస్ మోడల్ సారధ్యంలో తమ స్వప్నాల్ని సాకారం చేసుకోవడానికి పని చేస్తున్నారు. గ్లేజ్ నడిపిస్తున్న ఈ సమర్థవంతమైన సమగ్ర స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్ దేశంలోని ప్రతి వినియోగదారునికి గాల్వే ఉత్పత్తులను చేర్చేలా చూస్తుంది. వినియోగదారు దేశంలో ఎంత దూర ప్రాంతాల్లో నివసిస్తున్నా, అక్కడికి చేరుకోవడం ఎంత అసాధ్యమైనా ఉత్పత్తుల్ని అందిస్తుంది.

16 సంవత్సరాల నుంచి విజయవంతంగా బిజినెస్ చేస్తూ ఉండే నైపుణ్యం వల్లనే ఇది బ్రహ్మాండమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మారింది. జీవితంలో నిరాండబరత వంటి విలువల్ని పాటిస్తూ, వివిధ ఆకాంక్షలు, ఆశలు, కలలు, బహుమతులు, యాజమాన్యం, సంఘీభావం, గెలవాలనే పట్టుదలతో కూడిన స్వభావంతో ఉండే వ్యక్తులు ఎవరైనా విలువ- ఆధారిత గ్లేజ్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని వ్యాపారం చేయవచ్చు, అతి సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా అసాధ్యమనుకున్న లక్ష్యాల్ని సాధించవచ్చు.

డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వినియోగదారులకు నేరుగా నాణ్యత కలిగిన ఉత్పత్తులను వారి ఇంటి గడప వద్దనే వివరాలు తెలియజేసి, ప్రదర్శన ఇచ్చిన తర్వాతనే అమ్ముతారు. ఈ వ్యాపారంలో రిటైల్ అమ్మకం ఇప్పటివరకు నడుస్తున్న సాంప్రదాయిక ఫార్మాట్ సహాయం తీసుకోవడం జరగదు, లాయల్టీ, రివార్డు కార్యక్రమాలూ మాధ్యమంగా మా వినియోగదారులతో దీర్ఘకాల సంబంధం కొనసాగించడం జరుగుతుంది.