హోమ్  /  యూఎస్ గురించి  /  డైరెక్టర్ల నుండి సందేశము
Mesage from the Directors

డైరెక్టర్ల నుండి సందేశము :-

shadow

MR. SANJEEV CHHIBBER / శ్రీ. సంజీవ్ చిబ్బర్

Director / డైరెక్టర్

ఉత్సాహపూరితమైన క్రీడాకారుడైన శ్రీ. సంజీవ్ చిబ్బర్ అత్యంత ధైర్యము మరియు అభిరుచితో ఎప్పుడు తెలియని తీరాలకే ప్రయాణించాడు. గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా యొక్క వ్యవస్థాపక సభ్యుడు మరియు పూర్తి సమయ డైరెక్టర్ శ్రీ. సంజీవ్ చిబ్బర్ తన కుటుంబ వ్యయాల కొరకు ఒక స్థిరమైన ఉద్యోగము కొరకు వెతుకులాటతో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమలోకి తన క్లిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించారు.

తన ఆర్ధిక పరిస్థితులు మరియు వివిధ అవరోధాలు ఉన్నప్పటికి కూడా దానిని వృద్ధి చేయాలనే అతని సంకల్పము అడ్డులేనిదా నిలిచింది. హృదయములో ప్రజల మనిషి అయిన అతను తన కలలకు కొద్దికొద్దిగా కదలసాగాడు. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారములో అతని తొలి కష్టాల రోజులు పరిశ్రమలో అతని ప్రయాణానికి ఒక ఆకారాన్ని ఇవ్వడమే కాకుండా తన భవిష్యత్ కార్యకలాపాలను తెలుసుకొనుటలో సహాయపడ్డాయి.

భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళాలనే ఉత్సాహముతో, శ్రీ సంజీవ్ చిబ్బర్ గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా కొరకు ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు కలిగి ఉన్నారు. విదేశీ వ్యాపార వ్యూహములో భాగముగా, అతను గ్లేజ్ వ్యాపారము యొక్క నెట్వర్క్ ను ప్రపంచమంతట విస్తరింపజేయాలని మరియు వివిధ కులము, జాతి మరియు సమాజముల నుండి వచ్చే ప్రజలకు ఆసక్తికరమైన వ్యాపార అవకాశాలను అందించాలని ఆయన ఆలోచించారు.

"దురదృష్టాలను ఇష్టపూర్వకంగా ఎదుర్కొనే వారికి విధి దారిచూపుతుంది"


Managment

MR. CHETAN HANDA / శ్రీ. చేత హాండా

Director / డైరెక్టర్

యువకుడు మరియు ఔత్సాహిక వ్యాపారవేత్త అయిన శ్రీ. చేతన్ హాండా చిన్నగా ప్రారంభించి, పెద్దగా కలలుగని, పట్టుదలతో భారతదేశములోనే ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ అయిన గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై. లి. ప్రారంభించుటకు కృషి చేశారు. అతని ఆర్థిక అవరోధాలు మరియు పరిమితమైన వనరులు తన పనిని ప్రారంభించుటను ఆలస్యము చేసినా పెద్దగా ఆలోచించుటకు అతనికి ఆటంకపరచలేదు.

విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు మరియు ఎంబీఏ ఫైనాన్స్ చేసిన శ్రీ. చేతన్ హాండా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని వినమ్రంగా ప్రారంభించారు. అయినప్పటికీ, అతను తొందరలోనే ఒక ఆసక్తికరమైన ఆలోచనను ఏర్పరచుకున్నారు మరియు ఆ విధంగా గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై. లి. 2003 లో ప్రారంభించబడింది. “డబ్బుకు విలువ” అనేది అందించుటకు మరియు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారములో ఆదర్శవంతమైన అవకాశాలను సృష్టించుటకు సంకల్పించిన అతను విధితో ఒక సరళరేఖ గీసి తన వెంచర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

మిగతాది చరిత్రలో చెప్పినవిధంగా. నైతికంగా మొగ్గుచూపిన శ్రీ.చేతన్ హాండా సరైన పనిప్రదేశ వాతావరణాన్ని అందజేయడము ద్వారా భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు ఒక కొత్త ఆకృతిని ఇచ్చేందుకు నిశ్చయించుకొన్నారు. భారతదేశము వంటి భిన్న సంస్కృతులు ఉన్న దేశములో నెట్వర్క్ మార్కెటింగ్ అమొఘమైన సంభావ్యత కలిగి ఉంటుందని ఆయన ఎప్పుడు విశ్వసించారు. ఎందుకంటే ఈ రకమైన వ్యాపారము కేవలము ఉత్పత్తుల వాణిజ్యము కొరకు కాకుండా సంబంధాలను నిర్మించుకోవడము గురించి ఏర్పాటయింది. సంస్థ అభివృద్ధి కొరకు అథని వ్యూహములో భాగముగా అతను భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాన్ని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లాలని మరియు ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని అతను ప్రణాళిక తయారుచేస్తున్నారు.

"విజయము అంతిమము కాదు, వైఫల్యము ప్రాణాంతకమైనది కాదు. కొనసాగేందుకు ధైర్యమే లెక్కించబడుతుంది"


Managment

MR. SARABJEET SINGH / శ్రీ. సరబ్జీత్ సింగ్

Additional Director / డైరెక్టర్

కామర్స్ పట్టభద్రుడు అయిన శ్రీ. సరబ్‍జీత్ సింగ్, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై.లి. లో సేల్స్ ఽ మార్కెటింగ్ శాఖాధికారిగా ఉన్నారు. నవప్రవర్తక, అసాధారణ మరియు ప్రగతిశీల ఆలోచనలతో స్ఫూర్తి కలిగిన శ్రీ. సరబ్‍జీత్ సింగ్ కంపెనీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నారు. విజయము కొరకు తృష్ణ మరియు విజయము కొరకు కోరిక కలిగిన ఆయన చిన్నగా ప్రారంభించినా కూడా పెద్దగా సాధించారు. వ్యాపారవేత్తల ధృక్పథము మరియు స్ఫూర్తితో నడిచే అతని సేల్స్ శిక్షణ మాడ్యూల్స్, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా కొరకు అత్యంత సమర్థవంతమైన సేల్స్ బృందాన్ని తయారుచేసింది. అతని వ్యక్తిగత మార్గదర్శనము మరియు క్రియాశీలకమైన అతని నాయకత్వములో గ్లేజ్ సేల్ బృందము నిరంతర సానుకూల మార్పును చవిచూస్తోంది.

శ్రీ. సరబ్‍జీత్ సింగ్ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారము యొక్క నైతికంగా నడిచే గుర్తింపును స్థాపించుటకు ఊహిస్తారు. కంపెనీ కొరకు భవిష్యత్ అభివృద్ధి వ్యూహములో భాగముగా, భారతదేశములో డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారము చిత్రీకరించబడే విధానాన్ని మార్చేందుకు అతను కంపెనీ అమ్మకాలలో పునరుద్ధరణాత్మక మార్పులను ప్రవేశపెట్టే ప్రణాళికలు ఆలోచిస్తున్నారు

"నాయకులు ఉదాహరణల ద్వారా నాయకత్వము వహిస్తారు, కేవలము మాటలతో కాదు”"


Managment

MR. SUMIT KOHLI / శ్రీ. సుమీత్ కోహ్లీ

Additional Director / డైరెక్టర్

కామర్స్ పట్టభద్రుడు అయిన శ్రీ. సుమీత్ కోహ్లి, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై.లి. లో ఆపరేషన్స్ శాఖాధికారిగా ఉన్నారు. ఆయన కంపెనీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నారు. శ్రీ సుమీత్ కోహ్లీ నిశ్చయము మరియు పట్టుదలతో తన లక్ష్యాలను సాధించుకున్నారు మరియు అతి చిన్న వయసులో అత్యున్నత యాజమాన్యములో స్థానాన్ని సంపాదించుకున్నారు. కార్యాచరణ సేవకు సంబంధించిన సమస్యలు మరియు ఫిర్యాదులు తన వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటాయి, శ్రీ సుమీత్ కోహ్లీ నెట్వర్క్ యొక్క సరళమైన పనితీరుకు బాధ్యత వహిస్తారు.

గ్లేజ్ లో శ్రీ సుమీత్ కోహ్లీ గారి ప్రయాణము 2003 లో ప్రారంభము అయింది మరియు అప్పటి నుండి ఆయన కంపెనీలో ఒక ముఖ్యమైన భాగము అయ్యారు. శ్రీ సుమీ కోహ్లీ ఉత్తమ సేవలను అందించేందుకు స్ఫూర్తిని కలిగి ఉన్నారు. వినియోగదారులకు మైర్యు అమ్మకాల భాగస్వాములకు అత్యద్భుతమైన సేవలను అందించడము ద్వారా ప్రస్తుతము ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారములో మార్పులు తేవాలని ఆలోచిస్తున్నారు.

"ఒక వ్యక్తి తలచుకుంటే ఏదైనా చేయగలడు"