హోమ్ పేజ్  /  యూఎస్ గురించి  /  గ్లేజ్ గురించి

గ్లేజ్ గురించి: :-

shadow

గ్లేజ్ ట్రేడింగ్ సంస్థ 2003 వ సంవత్సరములో ఔత్సాహిక వ్యాపారవేత్తలైన శ్రీ. సంజీవ్ చిబ్బర్ మరియు శ్రీ. చేతన్ హాండా గార్లచే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ప్రారంభించబడింది. స్వేచ్ఛా ఎంటర్ప్రైజ్ మరియు ఐక్యతలో విజయములను ప్రోత్సహిస్తూ వ్యాపారముతో ముడిపడిన ప్రజల జీవితాలను మెరుగుపరుస్తూ వినియోగదారుల ఆనందాన్ని పెంచడము వారి ఉమ్మడి లక్ష్యము.

గ్లేజ్ కార్పొరేషన్ సిద్ధాంతాలు, సంక్షిప్తంగా, అధిక నాణ్యతతో ప్రత్యేకంగా రూపొందించబడిన ఎఫ్‍ఎంసీజీ ఉత్పత్తులను తయారుచేసి, మార్కెటింగ్ మరియు పంపిణీలలో నిమగ్నమైన ఛానల్ భాగస్వాములతో వ్యాపార లాభాలను పంచుకుంటూ, ఆ ఉత్పత్తులను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడము అనే సూత్రము నుండి తీసుకోబడ్డాయి. అంటే, పాల్గొనేవారికి కూడా సంపదలను తీసుకొని వచ్చే విధంగా ఐశ్వర్యాన్ని అందించే ఒక వ్యాపారము.

వ్యవస్థాపకుల స్పష్టమైన దృష్టి, అభిరుచి, సానుకూల ధృక్పథము, ఆకాంక్ష మరియు కార్యవాదం మరియు వారు యాజమాన్యము వహించే నిర్వహణా సిబ్బంది యొక్క ముఖ్యమైన బృందము అన్నీ ఈ కంపీనీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈరోజు, దేశవ్యాప్తంగా ఒక మిలియన్ స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లు తన కలలను సాకారం చేసుకోవడానికి గ్లేజ్ వ్యాపార నమూనాను కొనసాగిస్తున్నారు. దీనికి పాన్ ఇండియా ఫ్రాంచైసీ నెట్వర్క్ సహకారము అందిస్తోంది. ప్రతి యూజర్ కు వాళ్లు ఎలాంటి సుదూర ప్రదేశములో ఉన్నా మరియు దేశములోని ఎలాంటి మారుమూల ప్రదేశములో ఉన్నా కూడ సమర్థవంతమైన మరియు విస్తృతమైన స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉత్పత్తుల అందుబాటును సులభతరం చేస్తుంది.

గత 10 సంవత్సరాలుగా గ్లేజ్ ట్రేడింగ్ ప్రముఖమైన నైపుణ్యాన్ని పోగుచేసుకుంది. జీవితములోని వినమ్రమైన విలువలు మరియు ఆశ, బహుమతి, యాజమాన్యము, ఐకమత్యము మరియు గెలవాలనే కోరిక మొదలైన ఆకాంక్షలపై నిర్మితమై, గ్లేజ్ అత్యద్భుత ఫలితాలను సాధించేందుకు ప్రతి ఒక్కరికి అనేక అవకాశాలను అందిస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ తమ లక్ష్యాలను సాధించి తమ కెరీర్‍ను ఏర్పరచుకునేందుకు ఈ పరిణామ ప్రక్రియ విస్తారమైన శిక్షణ, మార్గదర్శకము మరియు సాధికారికత ప్రోత్సాహకాల రూపములో సహకారము, మార్గదర్శకమును అందిస్తుంది.

డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉత్పత్తుల వివరణ మరియు ప్రదర్శన తరువాత ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు తమ ఇంటి గుమ్మందగ్గరే అమ్మడము. రీటెయిల్ అమ్మకాల సంప్రదాయకమైన దుకాణపు ఫార్మాట్ ద్వారా కాకుండా లాయల్టీ మరియు రివార్డ్ కార్యక్రమాల ద్వారా వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాలను సృష్టించుకోవడము కొరకు కూడా ఇది ప్రయత్నిస్తుంది.